Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రన్నర్ ప్రవీణ్ కు తాడిచెర్ల పాలకవర్గం సత్కారం

రన్నర్ ప్రవీణ్ కు తాడిచెర్ల పాలకవర్గం సత్కారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కూరకుల ప్రవీణ్ ఇటీవల సీఎం కప్ జిల్లాలో విజయం సాధించి, రాష్ట్ర స్థాయికి ఎంపికైయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తాడిచెర్ల జీపీ కార్యాలయంలో సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు చెంద్రయ్య, కామ బాపు,నిరంజన్ ప్రవీణ్ కు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2026 సీఎం కప్ ఆటల్లో భాగంగా ప్రవీణ్ సిఎం కప్ జిల్లాస్థాయిలో 400 మెన్ ఓపెన్ కేటగిరి రన్నింగ్ అట్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడంపై అభినందించి, రాష్ట్ర స్థాయిలో కూడా తన ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -