- Advertisement -
– 12 పైసలు పతనమై రూ.86.82కు
– తేలని అమెరికా టారిఫ్..దిగుమతికి డాలర్ల డిమాండ్
న్యూఢిల్లీ : అమెరికా టారిఫ్ చర్చలకు తోడు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ మరింత పడిపోయింది. మరోవైపు ఇటీవల స్టాక్ మార్కెట్ల వరుస పతనం.. ఎఫ్‌ఐఐలు తరలిపోవడంతో మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పతనమై 86.82కు దిగజారింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 86.92 కనిష్టాన్ని తాకింది. ముడి చమురు బ్యారెల్ ధర 0.46 శాతం పెరిగి 70.36 వద్ద ముగిసింది.
- Advertisement -