Friday, September 12, 2025
E-PAPER
Homeబీజినెస్మరింత అగాథంలోకి రూపాయి

మరింత అగాథంలోకి రూపాయి

- Advertisement -

డాలర్‌తో పోల్చితే 88.47కు క్షీణత
చరిత్రలో ఎన్నడూలేనివిధంగా పతనం


ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ మరింత అగాథంలోకి జారింది. చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో 88.47కు పతనమయ్యింది. అమెరికా, భారత్‌ మధ్య చోటు చేసుకుంటున్న టారిఫ్‌ ఆందోళనలు రూపాయి విలువను చరిత్రలో ఇది వరకు ఎప్పుడు లేని కనిష్ట స్థాయికి పడేలా చేస్తున్నాయి. గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 36 పైసలు పతనమై 88.47కి దిగజారి.. ఆల్‌టైం కనిష్ట స్థాయిని చవి చూసింది. ఫారెక్స్‌్‌ మార్కెట్‌లో ఉదయం 88.11 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 88.47 అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఇంతక్రితం సెప్టెంబర్‌ 5న 88.38 కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్‌లో దిగుమతులను భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల భారం పెరిగిపోనుంది. భారత్‌పై అమెరికా వేసిన భారీ టారిఫ్‌లకు తోడు, విదేశీ నిధుల బయటకు తరలిపోవడం, డాలర్ల కొనుగోళ్లకు దిగుమతిదారులు మొగ్గు చూపడం, రూపాయి పతనాన్ని కట్టడి చేయడంలో మోడీ సర్కార్‌ విఫలం కావడం తదితర పరిణామాలు దేశీయ కరెన్సీని అగాథంలోకి నెట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -