- Advertisement -
నేడు గూపన్‌పల్లిలో అంత్యక్రియలు
నవతెలంగాణ- డిచ్‌పల్లి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఎమ్మెల్యే మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నర్సమ్మ (93) కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి కన్ను మూశారు. నేడు (మంగళవారం) కంఠేశ్వర్ బైపాస్‌లోని అశోక టౌన్‌షిప్‌లోని ఎమ్మెల్యే నివాసం నుంచి అంతమయాత్ర ప్రారంభమై.. గూపన్‌పల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిం చనున్నట్టు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
- Advertisement -