రెండో స్థానంలో వెర్‌స్టాపెన్
సింగపూర్ : ఎఫ్1 సింగపూర్ గ్రాండ్‌ప్రీ 2025లో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రస్సెల్ హౌరెత్తించాడు. ఆదివారం ఉదయం మేరినా బే స్ట్రీట్ సర్క్యూట్‌లో జరిగిన రేసులో జార్జ్ రస్సెల్ అదరగొట్టాడు. 4.9 కిమీల పొడవైన ట్రాక్‌పై 62 ల్యాప్‌లను వేగంగా పూర్తి చేసిన జార్జ్ రస్సెల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 1.40.22.367 సెకండ్లలో రేసును ముగించిన రస్సెల్ 25 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్.. రస్సెల్ కంటే 5.430 సెకండ్ల తర్వాత రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. మెక్‌లారెన్ డ్రైవర్, ఈ సీజన్లో హాట్ ఫామ్‌లో ఉన్న ల్యాండో నోరిస్ మూడో స్థానంలో నిలిచి పోడియం ఫినిషింగ్ చేయగా… మెక్‌లారెన్ మరో డ్రైవర్ ఆస్కార్ పియాస్త్రి నాల్గో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది ఫార్ములా వన్ సీజన్లో మరో ఆరు రేసులు మిగిలి ఉండగానే… మెక్‌లారెన్ డ్రైవర్లు ల్యాండో నోరిస్, ఆస్కార్ పియాస్త్రిలు నిలకడగా రాణించటంతో ఆ జట్టు ఈ సీజన్లో కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.