చైనీస్ గ్రాండ్ ప్రీ 2026
షాంఘై (చైనా) : ఎఫ్1 సీజన్‌లో మెర్సిడస్ డ్రైవర్ జార్జ్ రస్సెల్ (బ్రిటన్) దూకుడు కొనసాగుతుంది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీలో మెరిసిన జార్జ్ రస్సెల్.. తాజాగా షాంఘైలోనూ అదే జోరు చూపిస్తున్నాడు. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ రేసులో జార్జ్ రస్సెల్ అగ్రస్థానంలో నిలిచాడు. 5.451 కిమీ ట్రాక్‌పై 56 ల్యాప్‌ల (305.066 కిమీ) రేసులో రస్సెల్.. ప్రాక్టీస్‌లో 29 ల్యాప్‌లను 1.32.741 సెకండ్లలోనే పూర్తి చేశాడు. మెర్సిడస్ మరో డ్రైవర్ ఆంటోని ద్వితీయ స్థానంలో నిలిచాడు. మెక్‌లారెన్ డ్రైవర్లు ల్యాండో నోరిస్ (బ్రిటన్), ఆస్కార్ పియాస్ట్రి (ఆస్ట్రేలియా) టాప్-4లో నిలిచారు. లూయిస్ హామిల్టన్ (ఫెరారీ), మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్ రేసింగ్)లు వరుసగా 6, 8వ స్థానాలతో ముగించారు. చైనీస్ గ్రాండ్ ప్రీ రేసు నేడు జరుగనుంది. రసెల్ రేసును పోల్ పొజిషన్ నుంచి మొదలెట్టనున్నాడు.



