మాస్కో : ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని రష్యా అధికారికంగా గుర్తించింది. దీంతో ఆ అఫ్ఘన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఈనెల 3న ఆఫ్ఘనిస్తాన్ కొత్త రాయబారి సమర్పించిన ఆధారాలను అంగీకరించినట్టు రష్యా తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి కాబూల్‌లో.. ఆఫ్ఘనిస్తాన్‌లోని రష్యా రాయబారితో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ”దీనిని మేము స్వాగతిస్తున్నాం. ఇది సానుకూల ముందడుగు. ఇది రష్యాతో మా సంబంధాన్ని మెరుగుపరుస్తుంది” అని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అన్నారు. తాలిబాన్ దౌత్యవేత్త గుల్ హసన్.. మాస్కోలో కాబూల్ రాయబారి పాత్రను స్వీకరించిన కొద్దిసేపటికే ఈ చర్య రావటం గమనార్హం. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం విదితమే.
అఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES