- Advertisement -
ఇరాన్ వివాదాన్ని పరిష్కరించడంలో తమ వంతు సహకారం అందించడానికి రష్యా సిద్ధంగా ఉందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. తమ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ ప్రాంతీయ నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారని చెప్పారు. ”అధ్యక్షులు ఈ సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఒకవేళ మా సేవలు ఏ రూపంలోనైనా అవసరమైతే, సైనిక పరిస్థితి వీలైనంత త్వరగా శాంతియుత స్థితికి మళ్లేలా చూడటంలో మా వంతు సహకారం అందించడానికి మేం నిస్సందేహంగా సిద్ధంగా ఉన్నాం” అని పెస్కోవ్ విలేకరులతో అన్నారు. నాటోను రష్యా ఒక శత్రు కూటమిగా పరిగణిస్తుందని పెస్కోవ్ వివరించారు.
- Advertisement -



