Friday, December 26, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రైతుభరోసా పథకం నిలిపివేత..! ప్ర‌భుత్వం క్లారిటీ

రైతుభరోసా పథకం నిలిపివేత..! ప్ర‌భుత్వం క్లారిటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఆ వార్త పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనది, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేశారని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్ విభాగం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది. ‘రైతుభరోసా కింద తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఆ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. అలాగే నిలిపివేయడమూ లేదు. ప్రస్తుతం, సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందేలా చూసుకోవడానికి గ్రౌండ్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తున్నాయి. అలాగే, ఆర్థికశాఖ కూడా లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోంది. రైతుభరోసా నిలిపివేస్తున్నారని అని ప్రచారమవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం, అలాగే లబ్ధిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. గతంలో సాగు చేయని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయనే విమర్శలు ఉండటంతో.. ఈసారి టెక్నాలజీని జోడించింది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ భూమిలో పంట సాగు చేస్తున్నారు.. ఏ భూమి ఖాళీగా ఉంది అనే వివరాలను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా సేకరిస్తున్నారు.

కేవలం పంటలు సాగు చేసే రైతులకే ఈ పథకం వర్తించేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. సాగులో లేని రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలు, ఇతర బంజరు భూములకు ఈ సాయాన్ని నిలిపివేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా.. నిజమైన రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ నిబంధనలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -