Wednesday, May 7, 2025
Homeఆటలుసాచి జోడీ కిందకు!

సాచి జోడీ కిందకు!

- Advertisement -

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ప్రదర్శనతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌ సైతం దిగజారుతున్నాయి. డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి సహా రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి సింధు ర్యాంకింగ్స్‌లో టాప్‌-15లో సైతం చోటు దక్కించుకోలేదు. గాయాలతో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ నుంచి ఆటకు దూరంగా ఉంటున్న సాత్విక్‌, చిరాగ్‌ జోడీ పురుషుల డబుల్స్‌లో 11 నుంచి 18వ స్థానానికి పడిపోయారు. మాజీ వరల్డ్‌ నం.1 జోడీకి ఇటీవల కాలంలో ఇదే అత్యంత చెత్త ర్యాంక్‌!. మహిళల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ చాంపియన్‌ పి.వి సింధు ర్యాంక్‌ కాస్త మెరుగైంది. గతంలో 18వ స్థానంలో కొనసాగించిన సింధు.. తాజా జాబితాలో 16వ ర్యాంక్‌కు చేరుకుంది. మాళవిక బాన్సోద్‌ (23), రక్షిత శ్రీ (41), అనుపమ ఉపాధ్యాయ (42), ఆకర్షి కశ్యప్‌ (47)లు టాప్‌-50లో నిలిచారు. మహిళల డబుల్స్‌ విభాగంలో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జోడీ టాప్‌-10లో నిలిచింది. స్విస్‌ ఓపెన్‌ నుంచి ఆటకు దూరమైనా.. పదో ర్యాంక్‌ నిలుపుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ఓ స్థానం దిగజారి 19వ ర్యాంక్‌కు పడిపోగా.. హెచ్‌.ఎస్‌ ప్రణరు ఐదు స్థానాలు దిగజారి 35వ ర్యాంక్‌కు పరిమితం అయ్యాడు. ప్రియాన్షు రజావత్‌ మూడు స్థానాలు మెరుగై 33వ స్థానంలో నిలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టో జంట 19వ స్థానం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -