నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మను పురస్కరించుకొని జన్నారం శివారులోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వాగు దగ్గర పెద్ద బతుకమ్మను ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు సోహెల్షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అక్కడ మహిళలు, యువతులు పెద్ద బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. ఈ బతుకమ్మ వద్ద ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మహిళలతో కలిసి ఆడి పాడారు. బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకోవాలన్నారు. కలమడుగు తదితర గ్రామాల్లో కూడా మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. మండల కేంద్రంలోని వాసవి మాత ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వద్ద ఎస్సై గొల్లపల్లి అనూష మహిళలతో కలిసి ఆడి పాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జన్నారంలో ఘనంగా సద్దుల బతుకమ్మ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES