Tuesday, September 30, 2025
E-PAPER
Homeకరీంనగర్సాకినాకలో సద్దుల బతుకమ్మ..

సాకినాకలో సద్దుల బతుకమ్మ..

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ నియోజకవర్గానికి చెందిన వారు బొంబాయిలో స్థిరపడి ఉన్నా, తమ సంస్కృతి సంప్రదాయాలను మరువకుండా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం సాయంత్రం ముంబాయిలోని సాకినాక పోచమ్మగుడి వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళామణులు, ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మను అందంగా అలంకరించి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. “గౌరమ్మతో ఇచ్చుకో అమ్మ వాయనం – పుచ్చుకో అమ్మ వాయనం” అంటూ సాంప్రదాయ వాయనములు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. పిండి వంటలతో సిద్ధం చేసిన పదార్థాలను ఒకరికొకరు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ రాత్రి భోజన సదుపాయం కల్పించారు. ఈ వేడుక విజయవంతంగా జరగడానికి సహకరించిన సాకినాక పోలీసులకు గుడి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో ఎన్నం పరుశురాము, వావిలాల రాములు, గజ్జెల్లి రాజు, రాపల్లి సతీష్, కొంక లక్ష్మణ్, ఎన్నం రమేష్, చింతకింద నరేష్, గుజ్జ శ్రీకాంత్, శ్రీ గాది రాజేందర్, గాలి పెళ్లి మల్లేశం, వాసాల కైలాసం, బిట్ల కన్నయ్య, ముగ్గలము మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

మహిళల్లో బిట్ల ప్రమీల, గుజ్జ హైమావతి, గాజుల జ్యోతి, గాజుల సంధ్య, గాలి పెళ్లి లావణ్య, శ్రీ గాది లక్ష్మి, శ్రీ గాది సుకన్య, శ్రీ గాది స్వాతి, కొంక లక్ష్మీ, మ్యాన పూజిత, రాజుల సరిత, ఎముజీల లావణ్య, రాపెళ్లి రాజేశ్వరి, పడాల కవిత, కుందెన ఉమా, లగిశెట్టి రజిత, చింతకింది రాజేశ్వరి, ఇంజమూరి అమృత, గాజేల్లి జ్యోతి, గాజేల్లి సంధ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -