నవతెలంగాణ – జక్రాన్ పల్లి
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,గ్ రామపంచాయతీ, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి పెర్మనెంట్ చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సెప్టెంబర్ 7న హైదరాబాదులో జరిగే రాష్ట్ర సదస్సుకు నిజాంబాద్ జిల్లా నంచి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజారోగ్యం కోసం తపించి పనిచేసే సఫాయి కార్మికుల సమస్యలను విశాల హృదయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకొని, వేతనాలు పెంచాలని ఆయన కోరారు. స్వచ్ఛభారత్ లో స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఉద్యోగ, కార్మికులకు సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తేదీన ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని, అని పెన్షన్ రూ.10000 ఇవ్వాలని, పీఎఫ్ ఈఎస్ఐ చట్టాలను వర్తింపచేయాలని దాసు డిమాండ్ చేశారు.
అనేక సంవత్సరాలు నుండి అతి తక్కువ వేతనాలతో సఫాయి కార్మికులతో ప్రభుత్వం యెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆయన అన్నారు. ప్రజారోగ్యం కోసం సరిహద్దు సైనికులు లాగా కృషి చేస్తున్న సఫాయి కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని దాసు డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి, కేటగిర్ల వారీగా గుర్తించాలని, 30 లక్షలు ఇన్సూరెన్స్ కట్టాలని దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలను వర్తింపచేయాలని, ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్మికుల పిల్లలకు విద్యాసంస్థలలో రాయితీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి అబ్దుల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్, జిల్లా నాయకులు సోప్పరి గంగాధర్, పల్నాటి సాయిలు, శేఖర్, రాజన్న ,గణేష్, నరాటి లక్ష్మణ్, చెంచు వెంకవ్వ, రేణుక ,సర్వర్ లక్ష్మి, ఈదుల గంగమణీ, అంక్సాపూర్ నరసయ్య, చిట్టిబాబు, వర్డికల్ గంగాధర్, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుకు కదిలిన సఫాయి కార్మికులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES