జింబాబ్వేపై 5 వికెట్లతో గెలుపు
న్యూఢిల్లీ : టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతుంది. గ్రూప్, సూపర్8 దశను అజేయంగా ముగించిన దక్షిణాఫ్రికా..దర్జాగా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సూపర్8 గ్రూప్-1 మ్యాచ్‌లో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 154 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 17.5 ఓవర్లలోనే ఊదేశారు. మార్‌క్రామ్ (4), డికాక్ (0) విఫలమైనా.. డెవాల్డ్ బ్రెవిస్ (42), రియాన్ రికెల్టన్ (31), డెవిడ్ మిల్లర్ (33), ట్రిస్టన్ స్టబ్స్ (21 నాటౌట్), జార్జ్ (30 నాటౌట్) సమిష్టిగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. సికందర్ రజా (73, 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. 3 ఓటములతో జింబాబ్వే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా.. హ్యాట్రిక్ విజయాలతో సఫారీలు అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టారు.



