Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఆటలుసఫారీ ఏకపక్ష విజయం

సఫారీ ఏకపక్ష విజయం

- Advertisement -

2-0తో జింబాబ్వేపై సిరీస్‌ వశం
బులావయో :
జింబాబ్వేపై దక్షిణాఫ్రికా ఏకపక్ష విజయం సాధించింది. బ్యాట్‌తో, బంతితో తిరుగులేని ప్రదర్శన చేసిన సఫారీలు మూడో రోజే ఇన్నింగ్స్‌ 236 పరుగుల తేడాతో గెలుపొందారు. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైన జింబాబ్వే.. ఫాలోఆన్‌లో 77.3 ఓవర్ల పాటు పోరాడింది. కార్బిన్‌ బాచ్‌ (4/38), ముతుస్వామి (3/77), యుసుఫ్‌ (2/38) మెరవటంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 626/5 పరుగుల భారీ స్కోరు సాధించిన సంగతి తెలిసిందే. 367 పరుగులతో అజేయ ట్రిపుల్‌ సెంచరీ సాధించిన వియాన్‌ ముల్డర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ జులై 14న తొలి మ్యాచ్‌తో ఆరంభం కానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad