జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో ప్రమాదకర కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రోజు మినీ మీటింగ్ హాల్లో ప్రభుత్వ అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రసాయన ఔషధ పరిశ్రమల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘోర ప్రమాదాలు మానవ ప్రాణ నష్టం కలిగించాయని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణకు చేపట్టవలసిన చర్యలపై సమీక్షించారు. మొదటి దశలో పరిశ్రమల తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం భద్రత విషయంలో రాజీ పడదని అన్నారు.
ఫ్యాక్టరీలలో డ్రైర్లు, రియాక్టర్లు, పేలుడు ఉపశమన పానెల్ లు భద్రత వాల్యూ లు వంటివి కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. కార్మికులకు నిరంతరం భద్రతా శిక్షణా కార్యక్రమాలు , మాక్ డ్రిల్స్ నిర్వహించాలనీ,కార్మికుల ప్రాణ భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగినది. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, అగ్ని మాపక అధికారి మధుసూదన్ రావు,పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రమాదకర కర్మాకారాలలో భద్రత ప్రమాణాలను పకడ్బందీగా చేపట్టాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES