Sunday, June 29, 2025
E-PAPER
Homeసోపతిసాహిత్య అకాడమీ గ్రంథాలయం-న్యూఢిల్లీ

సాహిత్య అకాడమీ గ్రంథాలయం-న్యూఢిల్లీ

- Advertisement -

భారతదేశంలో సాహిత్యం, కళలు, సంస్కతిని జాతీయ స్థాయిలో ప్రోత్సహించడానికి సాహిత్య అకాడమీ ఒక ప్రతిష్టాత్మక సంస్థగా నిలిచింది. భారతదేశంలో మూడు ప్రత్యేక అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాహిత్య అకాడమీ (సాహిత్యం కోసం), లలిత కళా అకాడమీ (దశ్యకళలు కోసం), సంగీత నాటక అకాడమీ (నత్యం, నాటకం సంగీతం కోసం). 1954 మార్చి 12న ఈ అకాడమీని ప్రారంభించారు. గత 71 సంవత్సరాలుగా సాహిత్యకారులకు, పరిశోధకులకు, రచయితలకు విజ్ఞాన సాయం అందిస్తున్న ఒక గొప్ప సాహిత్య గ్రంథాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాహిత్య అకాడమీ గ్రంథాలయం భారతదేశంలోని అగ్రగణ్య బహుభాషా గ్రంథాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ గ్రంథాలయంలో సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషలలో సాహిత్యం, భాషలు, సంస్కతికి సంబంధించిన పుస్తకాల భాండాగారం ఉంది. ప్రధాన కార్యాలయ గ్రంథాలయంలో సుమారు 1,84,000 పుస్తకాలు ఉండగా, బెంగళూరు, కోల్కతా, ముంబైలలో ఉన్న ప్రాంతీయ కార్యాలయ గ్రంథాలయాలలో 80,000 పుస్తకాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయం సాహిత్య సిద్ధాంతాలు, విమర్శ, మహిళా అధ్యయనాలు, సాంస్కతిక చరిత్రలు, జీవిత చరిత్రలు, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, నీతికథలు, నవలలు, కథల సంకలనాలు, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పుస్తకాలుగా గుర్తించబడిన రచనలు వంటి విభిన్న అంశాలపై అపారమైన సంపదను కలిగి ఉంది. అంతేకాకుండా, ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, అనువాద సాహిత్యం వంటి విషయాలపై విస్తతంగా సమాచారం అందుబాటులో ఉంది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, శ్రీ అరవింద్‌, జవహర్లాల్‌ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి మహానుభావుల రచనలపై ప్రత్యేక సేకరణలు ఉన్నాయి. తత్వశాస్త్రం, మతం, కళలు, సంస్కతి, భారతీయ సంప్రదాయాలు, జానపద సాహిత్యం, గిరిజన సాహిత్యం వంటి విభాగాలలో అపురూపమైన పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి.
ఎన్సైక్లోపీడియా ఆఫ్‌ లాంగ్వేజెస్‌, ఇండియన్‌ లిటరేచర్‌, హూ ఇస్‌ హూ ఆఫ్‌ ఇండియా వంటి సూచన గ్రంథాలను కూడా ఈ గ్రంథాలయంలో చూడవచ్చు. ప్రొఫెసర్‌ గోపీచంద్‌ నారంగ్‌ బహుమతిగా ఇచ్చిన ప్రత్యేక పుస్తకాల సేకరణ కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పుస్తక ప్రచురణ సంస్థల రచనలు, బాలల సాహిత్యంపై విశేష పుస్తకాల సమాహారం, బాలల కోసం ఏర్పాటు చేసే పుస్తక ప్రదర్శనలు, సాహిత్య అకాడమీ ప్రచురించిన బాలల పుస్తకాల విక్రయం వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి.
ఈ గ్రంథాలయంలోని 24 భాషల పుస్తకాల కంప్యూటరీకరణ (రెట్రో కన్వర్షన్‌) చివరి దశకు చేరుకుంది. పుస్తకాల సమాచారాన్ని ఆన్‌లైన్‌ కేటలాగ్‌ (WebOPAC) ద్వారా సాహిత్య అకాడమీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
సాహిత్య అకాడమీ గ్రంథాలయం అందించే ప్రధాన సేవలు: ఆచూకీ విభాగం, సర్కులేషన్‌ విభాగం, పత్రికల విభాగం, న్యూస్‌ పేపర్‌ విభాగం, ప్రస్తుత సూచన సేవలు (Current Reference Services) , గ్రంథసూచి సేవలు (Bibliographic Services), ఫొటోకాపీ సేవలు, గ్రంథాలయాల మధ్య రుణ సౌకర్యం (Inter Library Loan).. పుస్తకాల ఇష్యూ విధానం ప్రకారం ప్రతి ఒక్కరికీ నెలకు 2 పుస్తకాలు ఇస్తారు. ఈ విధంగా సాహిత్య అకాడమీ గ్రంథాలయం సాహిత్యాభిమానులకు, పరిశోధకులకు, పాఠకులకు అపురూపమైన విజ్ఞాన నిలయంగా నిలుస్తోంది. సాహిత్య అకాడమీ గ్రంథాలయంలో ఒకేసారి వందమంది పాఠకులు కూర్చొని చదివే సౌకర్యం ఉంది. అభ్యాసానికి అనుకూలంగా నిర్మితమైన ఈ పఠనశాల సదుపాయం ఎంతో ఉపయోగకరం. అలాగే, నామమాత్రపు రుసుముతో ఫొటోకాపీ, స్కానింగ్‌, ప్రింటౌట్‌ వంటి సేవలు పాఠకులకు అందిస్తున్నారు. పత్రికల విభాగంలో దాదాపు 25 భాషలలో దినపత్రికలు, సుమారు 300 రకాల మాసపత్రికలు, ద్విమాస పత్రికలు, త్రైమాసిక పత్రికలు అందుబాటులో ఉన్నాయి.
డెల్‌నెట్‌ (DELNET) డేటాబేస్‌ సదుపాయం ద్వారా దేశవ్యాప్తంగా 900 పైన గ్రంథాలయాల నెట్‌వర్క్‌ సేవలు వినియోగదారులకు లభ్యమవుతాయి. దీనిద్వారా ఇంటర్‌ లైబ్రరీ లోన్‌ సదుపాయం కూడా ఉంది. ఈ గ్రంథాలయంలో సాహిత్య పత్రికల బౌండ్‌ వాల్యూములు ప్రత్యేకంగా భద్రపరిచారు. 1988 నుండి ఈ గ్రంథాలయంలో అందుకున్న సాహిత్య పత్రికలకు ఆన్‌లైన్‌ సూచిక రూపొందించబడింది. 1988-90, 1996 సంవత్సరాల ఇండియన్‌ లిటరరీ ఇండెక్స్‌ యొక్క హార్డ్‌ కాపీలు కూడా పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. గ్రంథాలయం సమాచార హెచ్చరిక సేవలు కూడా అందిస్తోంది, ఇందులో వార్తాపత్రిక కత్తిరింపులు, విషయ సూచికలు, పుస్తక సమీక్షలు వంటి సమాచారం పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ గ్రంథాలయానికి ప్రతిరోజూ సగటున 150 మంది పాఠకులు విచ్చేస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పరిశోధకులు, సాహిత్య ప్రియులు, విద్యార్థులు, పాఠకులు ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ గ్రంథాలయాలలో ఒకటిగా నిలుస్తోంది.
ఎలక్ట్రానిక్‌ పుస్తకాలు (ఇ-బుక్స్‌), డిజిటల్‌ వనరులు సాహిత్య అకాడమీ గ్రంథాలయంలో విస్తతంగా అందుబాటులో ఉన్నాయి. ఆంగ్లో-ఖాసి, కులవ్యవస్థ, భారత మధ్య తరగతి జీవితాలపై రచనల సంకలనాలు, ఫ్రెంచ్‌ సాహిత్య సంకలనం, హిమాలయన్‌ జర్నల్‌ (హుకర్‌ రచన), సింధు చరిత్ర వంటి విలువైన పుస్తకాలు ఇ-బుక్స్‌ రూపంలో ఉన్నాయి. ఓపెన్‌ యాక్సెస్‌ ఇ-రిసోర్సెస్‌ ద్వారా పాఠకులు, పరిశోధకులు ఉచితంగా ఎన్నో డిజిటల్‌ వనరులను ఉపయోగించవచ్చు. ఇ-బుక్స్‌ కోసం డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా, హాతీట్రస్ట్‌ డిజిటల్‌ లైబ్రరీ, ప్రాజెక్ట్‌ గుటెన్‌బర్గ్‌, గూగుల్‌ బుక్స్‌, ఓపెన్‌ లైబ్రరీ, ఫ్రీ ఇ-బుక్స్‌.నెట్‌, రేఖ్తా: ఇ-బుక్స్‌, ఆర్కైవ్‌ బుక్స్‌ వంటి వేదికలు అందుబాటులో ఉన్నాయి.
ఇ-జర్నల్స్‌ కోసం డైరెక్టరీ ఆఫ్‌ ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్స్‌, మ్యూజ్‌ ఇండియా, అకాడమిక్‌ జర్నల్స్‌, ఇ-జర్నల్స్‌.ఆర్గ్‌ ద్వారా సేవలు అందిస్తున్నాయి. ఇ-థీసిస్‌, డిసర్టేషన్స్‌ కోసం శోధ్‌ గంగా: భారతీయ థీసిస్‌ రిపోజిటరీ, కషికోష్‌, నెట్వర్క్డ్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ థీసిస్‌ అండ్‌ డిసర్టేషన్స్‌ వంటివి పరిశోధకులకు సేవలు అందిస్తాయి.
సాహిత్య అకాడమీ ప్రచురణలు ‘మేకర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ లిటరేచర్‌’ సిరీస్‌ ద్వారా బెంగాలీ, డోగ్రీ, ఆంగ్లం, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణీ, మరాఠీ, మైథిలీ, మలయాళం, నేపాలీ, పంజాబీ, సంస్కతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి భాషలలో అద్భుతమైన రచనలను ప్రచురించి, పరిశోధకులు, సాహితీవేత్తలకు విస్తత జ్ఞానభాండాగారంగా మారింది. గత సంవత్సరంలో 14,093 మంది సభ్యులు (కొత్తగా 173 మంది చేరారు) నమోదయ్యారు, 2,896 కొత్త పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్‌ అప్‌గ్రేడ్‌లు మరియు సేవలు భాగంగా గ్రంథాలయ వెబ్‌పేజీని వినియోగదారుల సౌలభ్యం కోసం పునఃరూపకల్పన చేశారు. అన్ని 24 భాషల పుస్తకాలను WebOPAC ద్వారా ఆన్‌లైన్‌లో శోధించవచ్చు. సభ్యులు, సిబ్బందికి అవసరమైన డిజిటల్‌ వనరుల కోసం ‘సాహిత్యసాగర్‌’ అనే డిజిటల్‌ లైబ్రరీని కూడా రూపొందించారు. దేశవ్యాప్తంగా సాహిత్య అకాడమీ నిర్వహించిన పుస్తక ప్రదర్శనలు సాహిత్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతగానో కషి చేస్తున్నాయి. రాజమహేంద్రవరం, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ వంటి ప్రదేశాలలో 2024లో అనేక ప్రదర్శనలు, సింపోజియంలు, పుస్తక విక్రయాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలో పదుల సంఖ్యలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, పుస్తకాలను ప్రజల వద్దకు చేర్చేందుకు సాహిత్య అకాడమీ చేస్తున్న కషి ప్రశంసనీయం. సాహిత్య అకాడమీ కషికి జేజేలు!

– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -