* తిరుమలగిరి అశోక్ అరెస్ట్
నవతెలంగాణ మిర్యాలగూడ: బీసీల రిజర్వేషన్ల కోసం ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారి మరణ వృధా కాదని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ముందస్తుగా ఆయనను అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి మరణం వృధా కాలేదు… ఇప్పుడు బీసీల హక్కుల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారి మరణం వృధా కానివ్వం అన్నారు.
బీసీ రిజర్వేషన్లకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చి రిజర్వేషన్లను తుంగలో తొక్కడం ఎంతో మంది బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా మాట ఇచ్చి మాటకు కట్టుపడకుండా బీసీలను మోసం చేసిన ముఖ్యమంత్రిగా చరిత్ర లో మిగిలిపోతారన్నారు. బీసీలను మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారం పీఠం ఎక్కిన తర్వాత బీసీలను అణిచివేస్తున్న రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి తప్పదని ఆయన అన్నారు రేవంత్ రెడ్డికి ఇదే చివరి రాజకీయ భవిష్యత్తు తర్వాత ముఖ్యమంత్రిగా కాదు ఎమ్మెల్యేగా కూడా గెలవ లేడని ఆయన అన్నారు ఎన్ని అరెస్టులు చేసిన బీసీ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదు ఉద్యమం ఉదృతం చేస్తామని ఆయన అన్నారు.



