నవతెలంగాణ – కట్టంగూరు
మండలంలోని పామనగుండ్ల గ్రామపంచాయతీ పరిధిలో 2వ వార్డు అభ్యర్థి కారంపూడి సాయికుమార్ అదృష్టం వరించడంతో ఎన్నికల్లో గెలుపొందాడు. రెండవ వార్డ్ లో మొత్తం 150 ఓట్లు ఉండగా 145 ఓట్లు పోలయ్యాయి. కాగా సాయికుమార్ ప్రత్యర్థి మంద యాదగిరి కి 47 ఓట్లు సాయికుమార్ కి 47 ఓట్లు లభించాయి. దీంతో పోలింగ్ అధికారులు ఇద్దరినీ సమన్వయపరిచి లక్కీ డ్రా తీయడంతో సాయికుమార్ ని అదృష్టం వరించడంతో వార్డు మెంబర్ గా లుపొందారు. ఒక ఓటు చెల్లని ఓటుగా గుర్తించగా ఆ ఓటు తనకే పడినట్లు సాయికుమార్ తెలిపారు. గ్రామంలో మూడో వార్డు ఎన్నికల్లో కూడా డ్రా ద్వారానే గెలుపొందారు. పోటీ చేసిన గోపగోని శిరీష కొప్పు వెంకటమ్మ ఇరువురికి 55 ఓట్లు రాగా విజేత నిర్ణయించేందుకు లక్కీ డ్రా తీయగా వెంకటమ్మ డ్రాలో గెలుపొంది వార్డు మెంబర్ గా విజయం సాధించారు.
లక్కీ డ్రాతో వార్డ్ మెంబర్ గా గెలిచిన సాయికుమార్
- Advertisement -
- Advertisement -



