Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేల్పూర్ లో సాయి పల్లకి సేవ

వేల్పూర్ లో సాయి పల్లకి సేవ

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : వేల్పూర్ మండల కేంద్రం శివారులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం, శివాలయం ప్రాంగణంలో గురువారం సుప్రభాత సేవ, కాకడ హారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ధ్యాన మందిరం నుండి సాయిబాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి, భజన కళాకారులతో భజన పాటలు పాడుతూ, ఆనందంగా నృత్యాలు చేస్తూ ఘనంగా పల్లకి సేవ  నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా ఆలయం వద్ద ఆర్మూర్ కు చెందిన బొల్లు మాధవి శ్రీనివాస్ దంపతులు, పచ్చల నడుకుడకు చెందిన మేకల లావణ్య వినోద్ దంపతులు, భీంగల్ కు చెందిన దేవయ్య ల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలకు ఆలయ అర్చకుడు శాలువా కప్పి సత్కరించగా, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోవిందగిరి స్వామి చిత్రపటాల్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన సాయి భక్తులు, సాయి సేవకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -