Wednesday, March 18, 2026
E-PAPER
Homeబీజినెస్మార్చి 24న సాయి పేరెంటరల్‌ ఐపిఒ

మార్చి 24న సాయి పేరెంటరల్‌ ఐపిఒ

- Advertisement -

– ధరల శ్రేణీ రూ.372-392గా నిర్ణయం
నవతెలంగాణ – హైదరాబాద్‌

ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్‌ కంపెనీ సాయి పేరెంటరల్‌ వచ్చే వారం ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు రానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సెబీకి సమర్పించగా అనుమతులు జారీ అయ్యాయి. మార్చి 24న ఇష్యూ ప్రారంభం కానుందని ఆ కంపెనీ మంగళవారం వెల్లడించింది. మొత్తం రూ.409 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా రూ.285 కోట్ల విలువైన కొత్త షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 31.57 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. షేర్ల ధరల శ్రేణీని రూ.372-392గా నిర్ణయించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ తమ వృద్ధి ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని ఎస్‌పిఎల్‌ సిఎండి అనిల్‌ కెెకె తెలిపారు. ఐపిఒ ద్వారా సేకరించిన నిధులను గ్లోబల్‌ ఫార్ములేషన్‌ బిజినెస్‌ను బలోపేతం చేయడానికి, అలాగే ఇంజెక్టబుల్‌, ఓరల్‌ సాలిడ్‌ డోసేజ్‌ విభాగాల్లో కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (సిడిఎంఒ) సామర్థ్యాలను విస్తరించడానికి వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఈ పెట్టుబడులు అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ ఉనికిని మరింత సుస్థిరం చేయనున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -