హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ శంకర్‌పల్లిలోని ఓ విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో సినీ పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు.
నిశ్చితార్థ వేడుకలో సాయి- కావ్య జంట తమ ప్రత్యేక బంధాన్ని ప్రతిబింబించేలా కస్టమైజ్డ్ జ్యువెలరీని ధరించారు. ఆ అందాన్ని మరింత పెంచుతూ వారి ఎంగేజ్మెంట్ లుక్స్‌ను ఢిల్లీకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అభిషేక్ శర్మ డిజైన్ చేశారు. సంప్రదాయం, ఆధునికత కలిసిన ఈ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు, నెటిజన్లు సాయి- కావ్య జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహ వేడుకకు శ్రీనివాస కావ్యాణం అని పేరు పెట్టారు.
వీరి వివాహ వేడుక ఈనెల 29న దివ్యమైన తిరుమలలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చిరస్మరణీయమైన వీరి కలయికకు అపూర్వ వేదికగా నిలవనుంది.
ఘనంగా సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం
- Advertisement -
- Advertisement -



