తమిళనాడు బ్యాటర్‌కు పక్కటెముకల గాయం
న్యూఢిల్లీ: భారత యువ క్రికెటర్ సాయిసుదర్శన్ గాయం బారిన పడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు బ్యాటర్ సుదర్శన్ పక్కటెముకలకు గాయమైంది. పరుగు తీసే సమయంలో డైవ్ చేయడంతో ఎముకలో చీలిక వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంగా సుదర్శన్ ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నట్లు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గాయంతో రంజీ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్న ఈ 24 ఏండ్ల క్రికెటర్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. ఐపీఎల్ సమయానికి అందుబాటులోకి రానున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో(సీవోఈ)లో రిహాబిలిటేషన్ పొందుతున్న సుదర్శన్ త్వరలోనే పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో మైదానంలోకి అడుగుపెట్టనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.



