- Advertisement -
హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు. హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ (హెచ్‌పీఎల్) ప్రాంఛైజీ కీర్తి వారియర్స్‌కు సైనా సహా యజమానిగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 10 నుంచి 28 వరకు జరుగనున్న హెచ్‌పీఎల్‌లో ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. స్పోర్ట్స్ స్కిల్స్‌కు సోషల్ ఎఫెక్ట్ జోడించి పికిల్‌బాల్‌ను సాధారణ క్రీడగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సైనా తెలిపింది. కార్యక్రమంలో కీర్తి వారియర్స్ ప్రాంఛైజీ ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -