నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో ఆదివారం సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్ర కార్యవర్గం,జిల్లా కమిటీ సభ్యులు కలిసి ఘనంగా నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ అరిగే లోకేష్ రాష్ట్ర,జిల్లా కమిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
సంస్థ వాట్సాప్ మాధ్యమం ద్వారా స్టేట్,సెంట్రల్ పోలీసు ఉద్యోగాలకు చదివే నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కవాతు శిక్షణ,బుక్స్,ఆన్లైన్ క్లాసెస్ చెబుతూ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 175 మందికి పైగా అభ్యర్థులను ఆర్మీ, పారామిలిటరీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యేలా చేసిందని నిర్వాహకులు తెలిపారు. తమ సంస్థ సేవలను నిరుపేద కుటుంబం నుండి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిజాయితీగా సన్నద్ధమయ్యే అభ్యర్థులకు చేరువ అయ్యేలా చేస్తామని సంప్రదించగలరని కోరారు.
త్వరలోనే సైమ్స్ అప్ ను సృష్టించి అభ్యర్థులకు సులభమైన మార్గం ద్వారా ఉన్నచోటే చదువుకోవడానికి వీలుగా ఆప్ ను తీసుకువస్తాం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్ ,జాయింట్ సెక్రటరీ నితీష్,రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ ,వీరన్న,మహేష్ వివిధ జిల్లాల కమిటీ సభ్యులు విక్రమ్ ఆదిత్య,ప్రవీణ్ నాయక్,నర్సింగ్, జ్యోతి,సంతోషిణి తదితరులు పాల్గొన్నారు.



