- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 3న మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం మూసివేస్తామని ఆలయ అధికారులు ఆదివారం తెలిపారు. బుధవారం రోజున గ్రహణం ఉన్నందున ఆలయం ఉదయం 7 గంటల నుండి మరుసటి రోజున గురువారం ఉదయం ఐదున్నర వరకు మూసే ఉంటుందని వెల్లడించారు. మండల పరిధిలోని భక్తులే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారు కూడా గమనించగలరని వారు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



