Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ పెట్రోల్ పంప్ సిబ్బందికి వేతనం పెంపు

పోలీస్ పెట్రోల్ పంప్ సిబ్బందికి వేతనం పెంపు

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
జిల్లాలోని పోలీస్ పెట్రోల్ పంపులో పనిచేస్తున్న కార్మికులకు నూతన సంవత్సరం సందర్భంగా వెయ్యి రూపాయలు వేతనం పెంచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఐపీఎస్ గురువారం వెల్లడించారు. నూతన సంవత్సరం వేడుకలను కార్మికులతో కలిసి ఎస్పీ జరుపుకున్నారు. వారితో కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కానుకగా రూ.1000 బోనస్, వీరికీ ప్రస్తుతం ప్రతి నెల జీతం రూ.14000/- నుండి రూ.15000/- పెంచడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కార్మికుల కుటుంబ ఆర్థిక పరిస్థితి, వారి విద్యా అర్హతలు తెలుసుకొని పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ జగన్, ఎం టి ఓ ఆర్ ఐ రాఘవ రావ్, సీసీ బాలరాజ్, పోలీస్ పెట్రోల్ పంప్ ఇంచార్జి  ఆర్.ఎస్.ఐ  గౌస్ పాష పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -