-స్వాధీనం చేసుకున్న డీసీఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఒక మందును మెడికల్ షాప్‌లో అమ్ముతున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. విశ్వసనీయ మైన సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు కరీంనగర్‌లోని పీఎల్‌ఎన్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ మెడికల్ షాపులో డాక్టర్ ఎథిక్స్ మెడిస్కిన్ మెడికేటెడ్ స్కిన్ కేర్ సోప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిని హిమాచల్ ప్రదేశ్‌లోని మాక్స్‌వెల్ ఫార్మా తయారు చేస్తున్నది. దీనిని చెన్నైలోని డాక్టర్ ఎథిక్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కోసం తయారు చేస్తున్నది. ఇందులో ఉపయోగిస్తున్న కాంబినేషన్‌తో కూడిన మందును భారత ప్రభుత్వం 2081 సెప్టెంబర్ 7న నిషేధించినట్టు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.
నిషేధిత మందు అమ్మకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES