నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని 30 గ్రామ పంచాయతీల పరిధిలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగను రైతన్నలు ప్రతి ఏటా పూర్వీకుల నుండి వస్తున్న ఆనవాయితీగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని పలువురు వ్యాపారస్తులు కాడేడ్లకు ఆవులకు దూడలకు అలంకరణ చేసేందుకు వివిధ రకాలైన రంగురంగుల గొండలు , కలర్ దారాలు , భాషింగలు, జూలు, తాయెత్తులు, వంటి అలంకరణ వస్తువుల అమ్మకాలు నిర్వహించేందుకు జోరుగా సరుకులు మార్కెట్లో అమ్మకాలకు పెట్టారు.
మండలంలోని పలు గ్రామాల పాడి రైతులు , ప్రజలు , ఎడ్ల పొలాల పండుగ సందర్భంగా పశువులకు అలంకరణ చేసి ముస్తాబు చేసేందుకు మండల కేంద్రానికి వచ్చి ఖరీదు చేసే విలువైన సామాన్లను కొనుక్కొని తీసుకువెళ్లడం జరుగుతుంది. పూర్వము జనుముతో స్వ యానా రైతులు ఇంటి వద్ద కొన్ని రోజుల పండుగకు ముందే చేతులతో తయారుచేసు కునే వారు . రాను రాను పాపం పద్ధతులు మార్చి కొంతపుంతలు రైతులు తొక్కుతు ప్రస్తుతం అలవాటు పడుతున్నారు. జనుము( జూట్ ) పంట పండించడం నేటి కాలంలో తగ్గిపోయింది . అంతా రెడీమేడ్ వస్తువులపైనే ఆధారపడుతూ వస్తున్నారు.
జోరుగా అలంకరణ వస్తువుల అమ్మకాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES