తనిఖీ బృందం ఏడీఏ అపర్ణ..
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండలంలో పలు విత్తన దుకాణాలను కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన విత్తన తనిఖీ బృందం ఏ డి ఏ. శ్రీమతి అపర్ణ ఆధ్వర్యంలో, పవన్ కుమార్ ఏ ఓ కామారెడ్డి, నరేంద్ర ఏ ఓ బీబీపేట్, తనిఖీ చేపడుతూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులకు నాణ్యతమైన విత్తనాలు మరియు విత్తన చట్టం పరిధిలో లోబడి అమ్మాలని సూచించారు. అందరూ విత్తన డీలర్లు తెచ్చుకున్న విత్తన స్టాక్స్ ఏప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలి. అలాగేఏ స్టాక్స్, ఏ కంపెనీ స్టాక్ తెచ్చుకున్నారో వాటి పిసి లు మరియు బిల్స్ ,ఇన్వైస్ పెట్టుకోవాలి.రైతులకు అమ్మిన విత్తనాలకు రసీదు తప్పకుండా ఇవ్వాలి. రైతులు ప్యాకింగ్ లేని విత్తనాలు కొనొద్దు అలాగే మధ్య దళారుల దగ్గర కాకుండా లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరే విత్తనాలు కొనాలనీ తెలిపారు. విత్తన డీలర్లూ ఎవరైనా పత్తి విత్తనాలను ,సోయా విత్తనాలను అధిక ధరలకు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు , మండల డీలర్లు పాల్గొనారు.
విత్తన చట్టంలోబడి అమ్మకాలు జరపాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES