నవతెలంగాణ – మిర్యాలగూడ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ కేంద్రాలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఏఐసీసీ మైనార్టీ విభాగం చైర్మన్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ అబ్జర్వర్లను నియమించారు. నల్గొండ జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ సలీం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో బోరబండ డివిజన్ వార్డు నెంబర్ 103 అబ్జర్వర్ నియమించారు. ఈ సందర్భంగా సలీం విలేకరులతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం విస్తృత ప్రచారం ఈనెల 29 నుంచి చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను బోరుబండ డివిజన్ పరిధిలోని 103 వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండ డివిజన్ అబ్జర్వర్ గా సలీం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



