Sunday, March 22, 2026
E-PAPER
Homeకరీంనగర్ఘనంగా మల్లన్న స్వామికి బోనాలు

ఘనంగా మల్లన్న స్వామికి బోనాలు

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
మండలంలోని మహితాపూర్ గ్రామంలోని మల్లన్న స్వామి దేవాలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం గ్రామ పెద్దలు,భక్తుల సమక్షంలో కళ్యాణోత్సవం జరిగింది. అనంతరం ఒగ్గుడోలు కళాకారుల వాయిద్యాలతో,మహిళలు పెద్దఎత్తున బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. మల్లన్న సన్నిధిలో ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు బూస గంగా మల్లయ్య,సంగ మల్లయ్య,వంగ మల్లయ్య,వంగ ప్రశాంత్,నాగుల రాజేందర్,గంగుల చిన్న గంగారాం,నాగుల గంగయ్య, మహేష్‌,హనుమాన్ మాల ధారణ స్వాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -