Friday, June 6, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్లక్షల మందిని మోసం చేస్తున్న సమంత..!

లక్షల మందిని మోసం చేస్తున్న సమంత..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతు ఉంటుంది టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత. సమంతకు మయోసైటీస్ రావడంతో గత రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇటీవ‌ల నిర్మాతగా మారి ‘శుభం’ చిత్రాన్ని తెరకెక్కించింది. అయితే ఆమె ఇటీవల పెట్టిన పోస్ట్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు సమాచారం అందిస్తుందంటూ ఓ డాక్టర్ సంచలన పోస్ట్ పెట్టడంతో అది కాస్త హాట్ టాపిక్‌గా మారింది.


సమంత ‘నికోటినామైడ్ మోనోన్యూక్లియోటైడ్’ సప్లిమెంట్లను ప్రమోట్ చేయడంపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె చెప్పేవన్నీ అబద్దాలేనని ప్రముఖ డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. ఈప్రొడక్ట్స్ వాడితే శక్తి పెరుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని ఆమె చెప్పింది. సమంత ఓ సైన్స్ తెలియని నటి. ఆ కంపెనీ మోసపూరితమైనది. నాడ్ అనేది శరీర జీవక్రియకు ముఖ్యమైన కోఎంజైమ్. అయితే nmnఅనేది నాడ్ స్థాయిలను పెంచుతుందని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రచారంలో ఉన్న ఒక సప్లిమెంట్.

చాలామంది nmnను వృద్ధాప్యాన్ని తగ్గించే అద్భుత ఔషధంగా మార్కెట్ చేస్తున్నారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. దీనివల్ల శరీరం శోషణకు గురవుతుంది. అవయవాలకు చేరుతుందని ఎటువంటి ఆధారాలు లేవు. అని పెట్టాడు. అంతేకాకుండా దీనికి సంబంధించిన పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. కొన్ని లక్షలమంది ఫాలోవర్స్‌ను మోసం చేస్తుదని అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫ్రాడ్ సప్లిమెంట్లను ప్రచారం చేస్తున్నందుకు స‌మంత‌ను తిట్టిపోస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -