నవతెలంగాణ-ఆలేరు టౌను : ఆలేరు పట్టణ శివారులోని సమ్మక-సారలమ్మ మేడారం జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డబ్బు చప్పులతో, మేళ తాళాలతో ఊర్లోని పోలిమేర అమ్మవార్లకు ఆలయ కమిటీ సభ్యులు కోళ్లను యాటాలను కోసి జాతర ప్రారంభించారు. సాయంత్రం సారలమ్మల ని, బోయ పూజారులచే ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ సబితా రెడ్డి, కమిటీ అధ్యక్షులు సామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఆలేరు పట్టణం, పరిసర ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా వెలిసిందని, భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ అమ్మవారు దీవెనలు అందజేస్తుందన్నారు.
భక్తులందరికీ మంచి జరుగుతుందనేది, ప్రతి ఒక్కరికి నమ్మకము అని పేర్కొన్నారు. ఆలయం నిర్మించి ఆరు సంవత్సరాలు అవుతుందన్నారు. వెలసి ఆరు సంవత్సరాలయిందని, జాతరకు చుట్టుపక్కల విలేజ్ లో నుంచి భక్తుల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని, అందరూ వచ్చి పండుగలు చేసుకుంటున్నారని, భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు.
జాతర మూడోసారి బ్రహ్మాండంగా జరుపుతున్నమా ని, సాయంత్రం సార్లమ్మ కి తీసుకొస్తామని, సమ్మక్క బుధవారం వస్తుందన్నారు. తేదీ 30న రాష్ట్ర ప్రభుత్వ విపు, ఆలేరు శాసనసభ్యులు, బీర్ల ఆయిలయ, పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జాతరకు హాజరవుతారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో సవిత సమ్మక-సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సబితా రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు సమ నారాయణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ముత్యాల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ విజయకుమార్, జాయింట్ సెక్రెటరీ శ్రీధర చారి, ట్రెజరర్ శేషాద్రి నీలిమ,కమిటీ సభ్యులు సాంబిరెడ్డి మల్లారెడ్డి, కొత్త రంగారెడ్డి ఇతర కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



