నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని పెర్కిట్ ..కోటార్మూర్ లో పూసల సంఘం ఆధ్వర్యంలో సమ్మక్క–సారక్క జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయానుసారంగా గద్దల వద్ద సమ్మక్క–సారక్క దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పూసల సంఘం నూతన అధ్యక్షులు పన్నీరు రవికుమార్ ఆధ్వర్యంలో, గౌరవ అధ్యక్షులు మదినేని చిన్నయ్య నేతృత్వంలో పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి.
ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, పెద్దమనుషులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలకు ప్రత్యేక శోభను చేకూర్చారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ జాతర కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పన్నీరు శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిపొదిలి సతీష్, కార్యదర్శి చేని శ్రీనివాస్, పొదిలి కిషన్,మద్దినేని నరేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.



