Saturday, September 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్‌కు సంపంగి గ్రూప్‌ ఆర్థిక సాయం

యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్‌కు సంపంగి గ్రూప్‌ ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
ప్రతిభావంతుడు, యువ పర్వతారోహకుడికి సంపంగి గ్రూప్‌ ఆర్థిక సాయం అందించింది. మహబూబాబాద్‌ జిల్లా ఉల్లిపల్లె భుక్యా తండాకు చెందిన భూక్యా యశ్వంత్‌ నాయక్‌ పర్వతారోహకుడు. హిమాలయ శిఖరారోహణకు అతను సమాయత్తమవుతున్నాడు. అతని ప్రతిభ గురించి, త్వరలో హిమాలయ పర్వాతారోహణకు వెళుతున్నట్టు సంపంగి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ రమేశ్‌ సంపంగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన పరికరాలు, శిక్షణ, ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ప్రతిభ, పట్టుదల కలిగిన యువతను ప్రోత్సహించడం సంపంగి గ్రూప్‌ లక్ష్యమని సంస్థ ఎండీ, సీఈఓ సురేశ్‌ సంపంగి తెలిపారు. వారందించిన సాయానికి యశ్వంత్‌ కతజ్ఞతలు తెలిపాడు. దేశానికి గౌరవం తెచ్చేలా కషి చేస్తానన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -