Sunday, October 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజపాన్‌ తొలిమహిళా ప్రధానిగా సానా తకైచి

జపాన్‌ తొలిమహిళా ప్రధానిగా సానా తకైచి

- Advertisement -

తమ కొత్త నేతగా ఎన్నుకున్న ఎల్‌డీపీ
తకైచి పాలనపై అందరి దృష్టి


టోక్యో : ఆర్థిక శాఖ మాజీ మంత్రి సానా తకైచిను తమ కొత్త నేతగా జపాన్‌ పాలక పార్టీ శనివారం ఎన్నుకుంది. దీంతో ఆమె తొలి మహిళా ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్‌ను దీర్ఘకాలంగా పాలిస్తున్న కన్జర్వేటివ్‌ లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ)కి తొలి మహిళా నేతగా ఎన్నికై ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అంతర్జాతీయంగా చూసినట్లైతే లింగ సమానతలో జపాన్‌కు బాగా పేలవమైన రికార్డు వుంది. ఈ నేపథ్యంలో ఆమె తొలి మహిళా నేత కానున్నారు.

ఎల్‌డీపీ పార్టీలో అంతర్గతంగా నిర్వహించిన ఓటులో మాజీ ప్రధాని కొయిజుమి కుమారుడైన వ్యవసాయ మంత్రి షింజిరో కొయిజుమిని ఓడించి తకైచి విజయం సాధించారు. ప్రధాని షిగెరు ఇషిబా స్థానంలో తకైచి బాధ్యతలు స్వీకరిస్తారు. దిగువ సభలో ఎల్‌డీపీనే అతిపెద్ద పార్టీ కావడం పైగా ప్రతిపక్షాలు తీవ్రంగా చీలికలు, పేలికలై వుండడంతో తదుపరి ప్రధాన పదవిని ఆమెనే వరించనుంది. శనివారం నాటి ఎన్నికల్లో జపాన్‌ పాలక పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలైన తకైచి ఇక ఎల్‌డీపీకి నూతన శకం ఆరంభమవుతుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -