Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅక్టోబర్‌ చివరి నాటికి.. సనత్‌నగర్‌ టిమ్స్‌ పనులు పూర్తి

అక్టోబర్‌ చివరి నాటికి.. సనత్‌నగర్‌ టిమ్స్‌ పనులు పూర్తి

- Advertisement -

అధికారులకు మంత్రి దామోదర ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సనత్‌నగర్‌ టిమ్స్‌ పనులను అక్టోబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలని రోడ్లు, భవనాలశాఖ అధికా రులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. హాస్పిటల్‌ ప్రారంభిం చిన రోజు నుంచే ప్రజలకు వైద్య సేవలందించే విధంగా అవసరమైన ఎక్విప్‌మెంట్‌, ఫర్నీచర్‌ అన్నీ ముందే సమకూర్చుకోవాలని హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తుకు మంత్రి సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించు కోవాలని డీఎంఈ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌, కొత్తపేట్‌ టిమ్స్‌ హాస్పిటళ్లు, నిమ్స్‌ హాస్పిటల్‌ విస్తరణ ప్రాజెక్ట్‌, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులపై శుక్రవారం హైదరాబాద్‌ లోని రాష్ట్ర సచివాలయంలో గల తన చాంబర్‌లో ఆర్‌ అండ్‌ బీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సనత్‌ నగర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయనీ, అల్వాల్‌, ఎల్బీనగర్‌ టిమ్స్‌ల పనులు మరో 6 నెలల్లో పూర్తవుతాయని అధికారులు మంత్రికి వివరించారు.

సనత్‌నగర్‌ టిమ్స్‌ను ఈ ఏడాది చివరిలో ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి గుర్తు చేశారు. అక్టోబర్‌ చివరి నాటికల్లా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆర్‌ అండ్‌ బీ, వైద్యారోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పని చేసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లో నూ పనులు ఆలస్యం కావొద్దన్నారు. ఎక్విప్‌మెంట్‌, ఫర్నీచర్‌ కొనుగోలు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనీ, డయా గస్టిక్‌ ఎక్విప్‌మెంట్స్‌ అన్నీ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడినవే కొనుగోలు చేయా లని సూచించారు. సంబంధిత డిపార్ట్‌మెంట్‌ డాక్టర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నిమ్స్‌ విస్తరణ ప్రాజెక్టు పనులపై మంత్రి ఆరా తీశారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌కు హాస్టల్‌ సదుపాయం కూడా అక్కడే ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మహబూబాబాద్‌, మంచిర్యా ల, జనగాం, వనపర్తి మెడికల్‌ కాలేజీ భవనాలను మరో 2నెలల్లో అప్పగిస్తామని ఆర్‌అండ్‌బీ అధికారు లు వెల్లడించారు. మరో 8 నెలల్లో మిగిలిన కాలేజీల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారుల ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో టీజీఎం ఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, ఆర్‌అండ్‌బీ సీఈలు రాజేశ్వర్‌రెడ్డి, లింగారెడ్డి, ఇతర అధికారులు, ఆయా భవనాలు నిర్మిస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -