Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకోకుంటే ఆంక్షలే

ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకోకుంటే ఆంక్షలే

- Advertisement -

– రష్యాకు ట్రంప్‌ బెదిరింపు

వాషింగ్టన్‌ : ఉక్రెయిన్‌ విషయంలో రెండు వారాల్లో శాంతియుత పరిష్కారం దిశగా పురోగతి కన్పించని పక్షంలో రష్యాపై ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించారు. వారం రోజుల క్రితం అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశం అయిన తర్వాత కూడా సమస్య పరిష్కారంలో ముందడుగు పడకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నాను. అది చాలా ముఖ్యమైన నిర్ణయం. పెద్ద ఎత్తున ఆంక్షలా లేక పెద్ద ఎత్తున సుంకాలా లేక రెండూ విధించాలా లేకుంటే ఇది మీ యుద్ధం…మేము చెప్పేదేమీ లేదని అనాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని ట్రంప్‌ శుక్రవారం చెప్పారు.ఇదిలావుండగా తనకు, పుతిన్‌కు మధ్య సమావేశం జరగకుండా చూడడానికి రష్యా అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. యుద్ధాన్ని ఎలా ఆపాలనే విషయంపై చర్చించేందుకు సమావేశం జరగాల్సి ఉన్నదని జెలెన్‌స్కీ అన్నారు. నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రట్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘యుద్ధాన్ని ఆపేయాలని వారు కోరుకోవడం లేదు. అందుకే సమావేశం జరగకుండా చూస్తున్నారు’ అని చెప్పారు. అయితే సమావేశం అజెండా ఇంకా సిద్ధం కాలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గరు లవ్‌రావ్‌ చెప్పారు. అలస్కా భేటీలో ట్రంప్‌ ప్రతిపాదించిన అంశాలపై పట్టువిడుపులు ప్రదర్శించడానికి రష్యా సిద్ధంగా ఉన్నదని తెలిపారు. పుతిన్‌-జెలెన్‌స్కీ మధ్య సమావేశాన్ని ఇంకా ఖరారు చేయలేదని, అయితే అజెండాను ఖరారు చేసిన తర్వాత చర్చలకు పుతిన్‌ సిద్ధంగానే ఉంటారని అన్నారు. పుతిన్‌-జెలెన్‌స్కీ మధ్య సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని ట్రంప్‌ ఇదివరకే తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad