నవతెలంగాణ-హైదరాబాద్: యుద్ధంలో చాలా కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ముగించడం చాలా ముఖ్యమైన అంశమని.. అందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా రష్యాకు ఉన్న నియమాలు ఏంటి? అనేది తెలియాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా కాల్పుల విరమణకు ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఒకవేళ రష్యా యుద్ధం ఆపకపోతే ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ట్రంప్ మాట్లాడారు. సంభాషణ తర్వాత జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ రష్యా యుద్ధం ఆపకపోతే ఆంక్షలు విధించాలి: జెలెన్‌స్కీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES