– మానేరు చెక్ డ్యామ్ కూల్చివేతపై సమగ్ర విచారణ చేపట్టాలి :మాజీ మంత్రి హరీశ్‌రావు
– మల్లన్నసాగర్ నీ తాత కట్టిండా?..
– సీఎం రేవంత్‌రెడ్డిపై ఫైర్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / జమ్మికుంట
మానేరు వాగుపై రూ.24 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్‌ను ఇసుక మాఫియానే పేల్చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన ఆరోపణ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విజిలెన్స్ విచారణ చేపట్టాలని, దోషులు ఎంతటి వారైనా వెంటనే అరెస్టు చేసి, నష్టపరిహారం రూ.24 కోట్లు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పరిధి లోకి వచ్చే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల శివారు వద్ద చెక్ డ్యామ్‌ను మంగళ వారం మాజీ మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజరు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు సందర్శిం చారు. పరిశీలన అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ పాలనలో చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్‌ల కూల్చివేతలు పరిపాటిగా మారాయి. గతంలో హుస్సేన్‌మియా వాగు, స్వర్ణ వాగుల పై కూడా పేల్చేశారు. ఇప్పుడు రూ.24 కోట్లతో కట్టిన చెక్ డ్యామ్‌ను రాత్రికి రాత్రే ఇసుక మాఫియా ముసుగులో పేల్చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష క్యూ సెక్కుల వరద వచ్చినా చెక్కు చెదరని ఈ డ్యామ్..ఇప్పుడెందుకు కూలింది ? అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ కట్టడం .. కాంగ్రెసోళ్లు కూలగొట్టడం’ జరుగు తోందని ఆరోపించా రు.ఇసుక మాఫియా దోషులను శిక్షించకుంటే రాష్ట్రంలో మరిన్ని చెక్ డ్యామ్‌లు పేలుస్తారని హెచ్చరించారు.
మల్లన్న సాగర్ ఎవరు కట్టారు?
‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని రేవంత్ రెడ్డి అంటున్నారు.. ఈ బ్లాస్టింగ్స్ చూస్తే కాళేశ్వరం కూడా కాంగ్రెస్‌నే కుట్రలు చేసి పేల్చి ఉండొచ్చని అనుమానం వస్తుంది. మల్లన్న సాగర్ ఎవరు కట్టారు.. నీ తాత కట్టిండా? కేసీఆర్ కాదా?’ అంటూ ముఖ్యమంత్రిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ డ్యామ్ ను నిర్మించిన రాఘవ కన్‌స్ట్రక్షన్ (రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డికి సంబంధించిన కంపెనీ) ను బ్లాక్‌లిస్టులో పెట్టి, టెండర్లను రద్దు చేయాలని, పొంగులేటి నుంచి నష్టాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇసుక మాఫియా పనే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



