Tuesday, February 24, 2026
E-PAPER
Homeజిల్లాలుపెద్దవంగరలో ఇసుక ట్రాక్టర్ పట్టివేత

పెద్దవంగరలో ఇసుక ట్రాక్టర్ పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు. తొర్రూరు మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన గుగులోతు సురేష్, ఆకేరు వాగు నుండి పెద్దవంగర మండలానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దవంగర శివారులో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకున్నామన్నారు. ఇసుకకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -