Saturday, October 25, 2025
E-PAPER
Homeకరీంనగర్ప్రమాదాలకు కారణం అవుతున్న ఇసుక ట్రాక్టర్లు...

ప్రమాదాలకు కారణం అవుతున్న ఇసుక ట్రాక్టర్లు…

- Advertisement -

మండేపల్లి నుండి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వద్దు..
గ్రామస్తుల నిరసన 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

మా గ్రామం నుండి ఇసుక రవాణాకు అనుమతి ఉండడం తో ఇసుక ట్రాక్టర్లు అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మండేపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మండేపల్లి గ్రామం నుండి ఇసుక రవాణాకు వారానికి ఒకరోజు అనుమతి ఉండడంతో శనివారం ఇసుక రవాణా జరుగుతుండగా  చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కమాన్ కు  ఉన్న శిలాఫలకం ను ట్రాక్టర్ డీ కొట్టడంతో శిలాఫలకం కాస్త పగిలిపోయింది. దీంతో గ్రామస్తులు ట్రాక్టర్లు అన్నింటిని నిలిపివేసి దాదాపు గంటకు పైగా నిరసన వ్యక్తం చేశారు. ఎస్సై ఉపేంద్ర చారి, అరేయ్ దినేష్ లు అక్కడికి చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మా గ్రామం నుండి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వడంతో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు. ఏ ఒక్క డ్రైవర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం ఈ ట్రాక్టర్లు నడపడం వల్ల విద్యుత్ వైర్లు తెగిపడి తృటిలో ప్రమాదం తప్పిందన్నారు. అంతేకాకుండా మురికి కాలువలపై ఉన్న సిమెంటు దిమ్మెలను కూడా పగిలేలా వాహనాలు నడుపుతున్నారన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అంతా మా ఇష్టమని వ్యవహరిస్తున్నారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -