ట్రాక్టర్ లకు రూ.2500 డిడి తీసుకోవాలి
నామినల్ ఖర్చుతో ఇసుక రవాణా
స్థానిక తహశీల్దార్ జె సురేష్ బాబు, ఎంపీడీవో సుమన వాణి
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ను తక్కువ (నామినల్) ఖర్చుతో ట్రాక్టర్ ల ద్వారా ఇసుకను పొందవచ్చు అని స్థానిక తహసిల్దార్ సురేష్ బాబు, ఎంపీడీవో సుమన వాణి లు అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పేరుట ఇసుక అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మండలంలో మొత్తం 510 ఇండ్లు మంజూరయ్యాయని, వీటికి ఒక్కొక్క ఇంటికి 10- 12 ట్రక్కుల ఇసుక అవసరం పడుతుందని దీనికి రెవెన్యూ శాఖ నుంచి టోకెన్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.
ఒక్కో కూపన్ అనుమతితో ఒక ట్రాక్టర్, ట్రక్కు ఇసుక మాత్రమే తరలించాలని ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. ట్రాక్టర్లకు 2500 బ్యాంకు డిడి తీసుకోవాలని అన్నారు. కూపన్లు తీసుకుని ఇసుక తరలించాలని సూచించారు. ఇందుకుగాను మండల వ్యాప్తంగా ఏడు ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రంగాపూర్ వాగు నుండి బీరెల్లి, రంగాపూర్ గ్రామాల ఇందిరమ్మ లబ్ధిదారులు ఇసుకను తీసుకెళ్లాలని తెలిపారు. నర్సాపూర్(పిఏ) గౌరారం వాగు ఇసుక రీచ్ నుండి గంగారం, కాటాపూర్, అంకంపల్లి, నర్సాపూర్(పిఏ) గ్రామాలకు తరలించాలన్నారు. పంబాపూర్ గౌరారం వాగు (రీచ్) నుండి పంభాపూర్, దామరవాయి, గ్రామాల ఇండ్లకు ఇసుక తరలించాలన్నారు.
కాల్వపల్లి తూముల వాగు (ఇసుక రీచ్) నుండి బయక్కపేట, కాల్వపల్లి ఇందిరమ్మ ఇళ్లకు తరలించాలన్నారు. ఊరట్టం జంపన్న వాగు (రీచ్) నుండి వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాలకు తరలించనున్నట్లు తెలిపారు. మేడారం జంపన్న వాగు నుండి తాడ్వాయి, వెంగళాపూర్, నార్లాపూర్, కామారం(పిటి) గ్రామాలకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించినట్లు చెప్పారు. ఇసుకను కూపన్ల ద్వారానే తరలించాలని, ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక రవాణా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES