Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్ పరిశీలన

ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్ పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో శనివారం పారిశుధ్య కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింతా రాజ శ్రీనివాస్ పరిశీలించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ తో కలిసి ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన శానిటేషన్ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శానిటేషన్ పను నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమం సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ తో కలిసి ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ పరిశీలించారు.

అనంతరం గ్రామంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను సర్పంచ్ తో కలిసి పరిశీలించిన ఆయన గ్రామాన్ని పరిశుభ్రత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. గ్రామంలో కాలనీలో రోడ్ల వెంట ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించాలని సర్పంచ్ లకు సూచించారు. గ్రామాల్లో ఉన్న వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఉప్లూర్ ఉప సర్పంచ్ తక్కురి రాజశేఖర్, కమ్మర్ పల్లి కొత్తపల్లి అశోక్,  గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -