- Advertisement -
సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని పల్లెల్లో పక్కాగా అమలు చేయాలనే నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో పారిశుధ్యం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శనివారం గ్రామంలోని పలు వార్డుల్లోని డ్రైనేజీల్లో చెత్త, చెదారం జీపీ సిబ్బందితో తొలగించి, అంతర్గరోడ్లను శుభ్రం చేశారు. అనంతరం నర్సరీని పరిశీలించారు. మొక్కలకు ప్రతిరోజూ రెండుపూటలా నీళ్లు పట్టాలని ఈజిఎస్ సిబ్బంది సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



