Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మసీదు వాడలో పారిశుధ్య పనులు

మసీదు వాడలో పారిశుధ్య పనులు

- Advertisement -

నవతెలంగాణ–కాటారం
జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కాటారం మండలంలోని కాటారం గ్రామపంచాయతీ మసీదు వాడలో ఆదివారం పారిశుధ్య పనులు నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడడం, వ్యాధుల నివారణ లక్ష్యంగా వీధులను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.

గ్రామ సర్పంచ్ పంతకాని సడవలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ ప్రజలకు సూచించారు. గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇటువంటి పారిశుధ్య కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండగొర్ల బాణయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి షాగీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -