సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పని చేస్తున్న శానిటేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఎడ్యుకేషన్ సంచాలకులు నవీన్ నికోలస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాఠశాలల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి ప్రభుత్వ గుర్తింపు, కనీస వేతనాలు అమలు కావటం లేదని పేర్కొన్నారు. కనీస మౌలిక సౌకర్యాలు లేక దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారనీ, ప్రభుత్వం వీరి శ్రమను గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచే క్రమంలో వీరికి ఇవ్వాల్సిన గ్లౌజులు, శానిటేషన్ సామాగ్రి కూడా ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలనీ, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలనీ, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జోగు రాములు, పిట్టల రమ, మల్లేశం, ప్రవీణ్, సైదులు, మంజుల, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
శానిటేషన్ కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



