- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి పోవాలని తాను కోరుకోవట్లేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. గతంలో రమణతో కలిసి పని చేశాననీ, ఇప్పుడు జీవన్‌రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఎల్.రమణకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండేదన్నారు. అలాంటి తప్పిదాలు చేయడంతోనే బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందని చెప్పారు.
- Advertisement -



