Saturday, September 27, 2025
E-PAPER
Homeకరీంనగర్ఇటీవల మరణించిన కుటుంబాలను పరమర్శించిన సంజయ్ కుమార్

ఇటీవల మరణించిన కుటుంబాలను పరమర్శించిన సంజయ్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ గౌడ్ ఇటీవల కరెంట్ షాక్‌తో మరణించారు. సోమవారం బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, మృతి చెందిన రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు.ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.యుక్తవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరమన్నారు. తీవ్ర వేదనలో ఉన్న రాకేష్ భార్య, తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అలాగే, వారి పిల్లల చదువులకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

అదేవిధంగా, చింతగుట్ట గ్రామానికి చెందిన బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బొంతల సంపత్ తల్లి బొంతల నర్సవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. చింతగుట్ట గ్రామానికే చెందిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మల్లేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లేష్ ను పరామర్శించి యోగక్షేమాలు కనుక్కున్నారు.ఈ పరామర్శలో జక్కని సంజయ్ కుమార్ వెంట నాయకులు ఆడెపు నర్సయ్య, కలకోట సమ్మయ్య, బంటు రాజు కుమార్, చల్లా రాజుతో పాటు రాకేష్ గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -